![]() |
![]() |

త్వరలో సంక్రాంతి పండగ రాబోతోంది. ఇక ఇప్పుడు బుల్లితెర వీటికి సంబంధించిన షోస్ ని రెడీ చేసి ఆడియన్స్ ని అలరించడానికి సిద్దమయ్యింది. ఇప్పుడు అలాంటి ఒక కొత్త ఈవెంట్ "మంచి రోజులు వచ్చాయ్...పండగో ఎంజాయ్" అనే టైటిల్ తో ఎంటర్టైన్ చేయబోతోంది. దీనికి సంబంధించిన ఒక ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ ప్రోమోలో రీల్ కపుల్స్, రియల్ కపుల్స్ అందరూ ఎంట్రీ ఇచ్చారు.. హైపర్ ఆది , ఇమ్మానుయేల్, మానస్, అంబటి అర్జున్, నటి సుధా, వర్ష, కృష్ణ భగవాన్, అన్నపూర్ణ, రాగిణి, పటాస్ ప్రవీణ్, ఆటో రాంప్రసాద్, నిరుపమ్, మంజుల, విష్ణుప్రియ.. ఇలా అందరూ కలర్ ఫుల్ డ్రెస్సెస్ లో కనిపిస్తూ ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్నారు.
ఇక కృష్ణ భగవాన్ వచ్చి " ఇంతకు ఎలా చేస్తారు" అని అడిగేసరికి " ఓ ...ఆటలు, పాటలు , డాన్సులు అన్ని ఇరగ్గొట్టేస్తాం" అని ఆది ఆన్సర్ ఇచ్చాడు. ఇక ఈ ఈవెంట్ లో ఒక అద్దిరిపోయే స్పెషల్ ట్విస్ట్ ని కూడా చూపించారు. మంజుల కూతురు శ్రీదేవి ఈ షోలో కనిపించడమే ఆ ట్విస్ట్. ఈమె ప్రభాస్ తో "ఈశ్వర్" మూవీలో నటించి హీరోయిన్ గా మారారు. ఆ తర్వాత హీరో తరుణ్ తో "నిన్నే ఇష్టపడ్డాను" మూవీ చేసింది కానీ పెద్దగా ఆడలేదు. తర్వాత ఆమె సైడ్ క్యారెక్టర్స్ లో నటించి తర్వాత ఫేడ్ అవుట్ ఐపోయింది. కొంత కాలానికి అంటే 2011 లో రవితేజతో కలిసి "వీర" మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది కానీ పెద్దగా లక్ కలిసి రాలేదు. ఇక ఫైనల్ గా రాహుల్ అనే అతన్ని పెళ్లి చేసుకుని చెన్నైలో సెటిల్ ఐపోయింది. ఇప్పుడు ఆమెకు రూపిక అనే పాప ఉంది.
ఈమె ఈ ఈవెంట్ కి ఎంట్రీ ఇచ్చి స్టేజి మొత్తాన్నిషేక్ చేసింది. ఇక ఆది ఎప్పటిలానే శ్రీదేవిని ఫుల్ గా మోసేసాడు. "నువ్వు శ్రీదేవైతే ..నేనే చిరంజీవంట" అనే పాట పాడి ఆమెను ఫిదా చేసేసాడు. ఈ కార్యక్రమం సంక్రాంతి పండగ రోజు ఈటీవీలో ప్రసారం కాబోతోంది.
![]() |
![]() |